నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన డాకూ మహారాజ్ స్పెషల్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది. జనవరి 12వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు బెనిఫిట్ షో టికెట్ ధరను రూ.500 గా నిర్ణయించింది. టికెట్ ధరపై మల్టీప్లెక్స్‌లలో రూ.135, సింగిల్ స్క్రీన్‌లలో రూ.110 అదనంగా పెంచుకోవడానికి అనుమతించింది. జనవరి 12 నుంచి 25 వరకు రోజుకు 5 షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది.