ఏపీలో సినిమా స్టూడియోలు పెట్టమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ TFIని కోరారు. శనివారం గేమ్ ఛేంజర్ మెగా పవన్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. "ఏపీలో బలమైన యువత ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతంగా ఉండాలి. రాష్ట్రంలో పలు చోట్ల ప్రొడక్షన్ డిజైన్, స్టంట్ స్కూల్స్, స్టూడియోలు పెట్టండి. 24 క్రాఫ్ట్‌లకు సంబంధించిన విషయాలు నేర్పండి. సినీ పరిశ్రమలో ఉన్న నిపుణులతో యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచండి." అని పేర్కొన్నారు.