పవన్‌కు మద్దతుగా రంగంలోకి వరుణ్ తేజ్

82చూసినవారు
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు మద్దతుగా టాలీవుడ్ హీరో వరుణ్‌ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పవన్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో వ‌రుణ్ రేపు ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తార‌ని జ‌న‌సేన పార్టీ ప్ర‌క‌టించింది. గొల్లప్రోలు రూరల్‌ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం ప్రారంభమై వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించింది.

ట్యాగ్స్ :