కొత్తవలస: దివ్యాంగులకు సేవలు అందించడం హర్షణీయం
కొత్తవలస మండలం మంగళపాలెం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆవరణలో నిర్మించిన విజయశ్రీ క్యాన్సర్ ఆసుపత్రిని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పూర్వం జైపూర్ వెళ్లి పరికరాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. అలాగే రోడ్డు ప్రమాదానికి గురైతే తక్షణమే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి గోల్డెన్ అవర్ ను వినియోగించుకోవాలన్నారు.