దత్తిరాజేరు మండలం కోరప కృష్ణాపురం గ్రామంలో శనివారం ప్రభుత్వ 104 వాహనం ద్వారా డాక్టర్ సాయి గౌతమి ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించారు. బీపీ షుగరు డయాబెటిస్ జ్వరము చెక్ చేసి అవసరమైనమేరకు ఉచితంగా మందులు అందజేశారు. అంతే కాకుండా నెలలో రెండుసార్లు 104 వాహనం వస్తుందని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డియో దీపిక, డ్రైవర్ శంకర్రావు, ఏఎన్ఎం చిన్నములు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.