మన్యం జిల్లాకు చెందిన ఎన్టీఎఫ్ కానిస్టేబుల్ అల్లు రామకృష్ణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ప్రతిభ కనబరిచి నాలుగు స్వర్ణ పతకాలు సాధించారు. జిల్లా ఎస్పీ మంగళవారం కానిస్టేబుల్ రామకృష్ణను అభినందించారు. గుడివాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలో 5కి. మీ. రన్నింగ్, 1500 మీటర్ల రన్నింగ్, లాంగ్ జంప్, 4×100 రిలే పోటీల్లో విజేత సాధించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచినందుకు పార్వతీపురం మన్యం జిల్లా వాసులు అభినందించారు.