పార్వతీపురం: కుష్టువ్యాధి లక్షణాల గుర్తింపు సర్వే
పార్వతీపురం మండలం ఎం. ఆర్ నగరం, చినబొండపల్లి గ్రామాలను వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డా. టి. జగన్ మోహనరావు సోమవారం సందర్శించి హెల్త్, వెల్నెస్ కేంద్రాలు, లెప్రసీ సర్వే తనిఖీ చేశారు. కుష్టువ్యాధి లక్షణాలు గుర్తించడం కోసం సర్వే చేపడుతున్న తీరు, ఏమేరకు పూర్తిచేసారు వివరాలు పరిశీలించారు. అనుమానిత లక్షణాలతో ఎవరినైనా గుర్తించారా అని ఆరాతీసి సర్వే పూర్తి చేసిన ఇంటికి మార్కింగ్ విధానాన్ని గమనించారు.