Oct 26, 2024, 14:10 IST/
బాంబు బెదిరింపులు.. సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం హెచ్చరిక
Oct 26, 2024, 14:10 IST
విమానయాన సంస్థలకు ఇటీవల కాలంలో బాంబు బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.