నగర సంకీర్తనలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బుధవారం సాయంత్రం పెందుర్తి మండలం సుజాతనగర్ నుంచి చిన్నముషిడివాడ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. తిరుపతి వెంకన్న లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని కలిపి అపచారం చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. దానికి ప్రాయశ్చిత్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.