Sep 16, 2024, 04:09 IST/
ఇళ్లలోకి వచ్చిన మొసలి.. బంధించిన గ్రామస్తులు (వీడియో)
Sep 16, 2024, 04:09 IST
ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పలు చోట్ల మొసళ్లు గ్రామాల్లోకి ప్రవేశించిన ఘటనలు చూశాం. తాజాగా ఆదివారం ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ఓ గ్రామంలోకి మొసలి ప్రవేశించింది. మొసలిని చూసి కుక్కలు మొరగడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. ఎలాగోలా ధైర్యం చేసి దానిని తాళ్లతో బంధించారు. అనంతరం పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి దానిని ట్రక్కులోకి ఎక్కించి తీసుకువెళ్లారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.