చిలకలగెడ్డ పంచాయతీలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
అనంతగిరి మండలం చిలకలగడ్డ పంచాయతీలో మంగళవారం 'పొలం పిలుస్తుంది' కార్యక్రమాన్ని సర్పంచ్ మజ్జి అప్పారావు మరియు ఎంపీటీసీ మెతుల అధ్యక్షతన నిర్వహించారు. జడ్పీటీసీ దీసరి గంగరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సహాయపడుతుందన్నారు. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఉత్పత్తి సాధించడం, నిక్కర ఆదాయాన్ని పెంచడం లక్ష్యమన్నారు.