దసరా సందర్భంగా విశాఖ మార్కెట్లో నాటు కోళ్లకు భలే గిరాకీ ఏర్పడింది. ఆరులోవలోని, భీమిలి మార్కెట్లో నాటు కోళ్ల ధర చుక్కలు చూపిస్తున్నాయి. అత్యధికంగా రూ. 1500ల వరకు ధర పలుకుతోంది. దసరాకి కచ్చితంగా నాటుకోడి కూర ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ధర ఎక్కువైనా వినియోగదారులు ఎక్కడా తగ్గడం లేదు. అలాగే మేకలు, గొర్రెల ధరలు కూడా అమాంతం పెరిగాయి.