
విశాఖ: మధురవాడలో నిలిచిపోయిన ట్రాఫిక్
భీమిలి సమీపంలోని మధురవాడ అండర్ బ్రిడ్జి దగ్గర సోమవారం రాత్రి భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు గంట నుంచి వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు ప్రతి రోజూ రాత్రి సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్కూల్స్, ఆఫీసు నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది.