Sep 24, 2024, 01:09 IST/
సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన ఎన్టీఆర్
Sep 24, 2024, 01:09 IST
‘దేవర’ మూవీ టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి హీరో ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. “దేవర విడుదల కోసం కొత్త జీవో జారీ చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మీరు అందిస్తున్న తిరుగులేని మద్దతుకు కృతజ్ఞతలు” అని తారక్ ట్వీట్ చేశారు.