
తెలంగాణలో దారుణ హత్య
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షనల్ వద్ద ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరశురాం (39)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమర్చారు. మృతుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.