నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఉద్రిక్తత
నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ పెట్టొద్దని బుధవారం గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల నాయకులు రాజయ్యపేట శాఖా కార్యదర్శి ఎం. మహేష్ బాబు మోడీ శంకుస్ధాపన చేయనున్న ప్రాంతానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం నాయకుడికి మద్దతుగా గ్రామస్తులు కదిలిచ్చి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది