లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు అప్పగింత
కోటవురట్ల మండలం రాజుపేట చౌడువాడలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు మంగళవారం మండల టీడీపీ అధ్యక్షుడు జానకి శ్రీను, రాజుపేట గ్రామ సర్పంచ్ వెంకటరమణ ఇళ్ల తాళాలను అప్పగించారు.కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పేద ప్రజల కోసం కూటమి ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు శ్రీను తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ప్రకాష్, తిరుమలరావు, బాజ్జి, శివ నూకరాజు పాల్గొన్నారు.