AP: డిప్యూటీ సీఎం పవన్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కూటమి పాలన మొదలయ్యాక పంచాయతీరాజ్ శాఖలో పలు మైలురాళ్లు దాటామని పేర్కొన్నారు. ‘వైసీపీ ఐదేళ్ల పాలనలో 1800 కి.మీ సీసీ రోడ్లు వేస్తే.. కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనలో 3,750 కి.మీ వేసింది. మినీ గోకులాలు వైసీపీ 268 ఏర్పాటు చేయగా.. కూటమి 22,500 నెలకొల్పింది. పీవీటీజీ ఆవాసం కోసం వైసీపీ రూ.91 కోట్లు వెచ్చించగా.. మా ప్రభుత్వం రూ.750 కట్లు ఖర్చు పెట్టింది.’ అని వెల్లడించారు.