ఆచంట: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు వెంకట అన్నారు. పోడూరు మండలం పండిత విల్లూరులో గురువారం అర్హత ఉండి రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు, పెన్షన్, వ్యక్తిగత మరుగుదొడ్లు, తదితర సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.