నరసాపురం:వ్యర్థలతో కలుషితంగా మారిన కాలువ
నిడదవోలు-నరసాపురం ప్రధాన పంట కాలువ ఇరగవరం సమీపంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలేటిపాడు, అయితంపూడి, పెనుగొండ, నెగ్గిపూడి వంటి గ్రామాల వద్ద పెద్ద ఎత్తున వ్యర్థాలు నీటిలో నిలిచిపోవడం వల్ల నీరు మురికిగా మారుతుందని పేర్కొన్నారు. కాలువ ప్రక్షాళన చర్యలు తక్షణమే చేపట్టాలని గురువారం రైతులు కోరుతున్నారు.