Feb 22, 2025, 11:02 IST/
SLBC టన్నెల్ ప్రమాదంపై ఈటల దిగ్బ్రాంతి
Feb 22, 2025, 11:02 IST
SLBC టన్నెల్ ప్రమాదంపై MP ఈటల రాజేందర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. గాయపడిన వారికి చికిత్స అందించాలన్నారు. ప్రమాదంపై అధికారిక ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరూ సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. కాగా, చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు జరుగుతున్నాయి.