నల్లజర్ల: కరెంట్ పోల్ ఎక్కి తాగుబోతు హల్ చల్
నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో ఒక తాగుబోతు కరెంట్ పోల్ ఎక్కి హల్ చల్ చేసాడు. స్థానికులు ఇది గమనించి ట్రాన్స్ఫారమ్ ను ఆఫ్ చేసి ప్రాణాలను కాపాడారు. కాగా గ్రామస్తులు అరిచి కేకలు పెట్టిన కూడా కిందికి రాకపోవడంతో చేసేదేమి లేక పోలీసులకు ఫోన్ చేసారు. ఇక ఇలా మాట వినడం లేదని "నువ్వు చస్తే చావు మేము కరెంట్ ఆన్ చేస్తాం" అని చెప్పడంతో, భయపడి అతడు పోల్ దిగి జారుకున్నాడు.