స్పౌజ్ కేటగిరీలో పింఛన్లపై వారిలో టెన్షన్!
AP: పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే స్పౌజ్ కేటగిరీ కింద ప్రభుత్వం భార్యకు పింఛన్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పింఛన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భర్త చనిపోయిన భార్యకే కాకుండా.. భార్య చనిపోయిన భర్తకు సైతం ఈ పింఛన్ వర్తింపజేయాలని కోరుతున్నారు. భార్య చనిపోయి ఇప్పటివరకు పింఛన్ రాని భర్తల్లో టెన్షన్ నెలకొందని చెబుతున్నారు. మరోవైపు నవంబర్ 1 - డిసెంబర్ 15 మధ్య 23 వేల మంది చనిపోతే.. 5 వేల మందికే స్పౌజ్ పింఛన్లు ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.