ఇంట్లో భోజన తయారీ ఖర్చు గత డిసెంబర్ నెలలో పెరిగిందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. టమోటాలు, బంగాళాదుంపలు, చికెన్ ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. డిసెంబరులో శాకాహార థాలీ తయారీ సగటు వ్యయం రూ.31.6 కు చేరింది. మాంసాహార థాలీ ధర వార్షిక ప్రాతిపదికన 12% పెరిగి రూ.63.3కు చేరింది. ఏడాది క్రితంతో పోలిస్తే డిసెంబరులో కిలో టమోటాల ధర 24% పెరిగి రూ.47కు, బంగాళాదుంపల ధర 50% పెరిగి రూ.36కు చేరాయి. బ్రాయిలర్ చికెన్ ధర 20% పెరిగింది.