భారత్‌లో HMPV వైరస్ కేసుల సంఖ్య ఏడుకి చేరింది. వీటిలో గుజరాత్లో 1, కర్ణాటక, నాగ్‌పుర్, తమిళనాడుల్లో రెండేసి హెచ్ఎంపీవీ కేసులు రికార్డ్ అయ్యాయి. పైగా ఈ వైరస్ బారిన పడిన వారందరూ నెలల బిడ్డలే కావడం గమనార్హం. అయితే దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది పాత వైరస్ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. బెంగళూరులో మూడు నెలల చిన్నారి కోలుకుని డిశ్చార్జి కాగా, మరో చిన్నారి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.