AP: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 5 పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడలో ఒక మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమ్మోనియా ఉత్పత్తి ప్లాంట్, రెండు గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ ఉత్పత్తి యూనిట్, నంద్యాల, వైఎస్సార్ జిల్లాలో 119 మెగా వాట్ల పవన, 130 మెగా వాట్ల సౌర హైబ్రీడ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం, కర్నూలులో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.