
అంబేద్కర్‌కు అవమానం.. విగ్రహంపై ఉమ్మి వేసిన దుండగులు
యూపీలో అంబేద్కర్ విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. రాయ్‌బరేలి జిల్లా దల్మౌ కొత్వాలి ప్రాంతంలోని అంబేద్కర్ పార్క్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు ఉమ్మి వేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై స్థానిక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా.. ఈ ఘటన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది.