AP: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోడూరి లక్ష్మీనారాయణ తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను వినూత్నంగా రూపొందించారు. పెళ్లి విందులో వడ్డించే వంటకాల జాబితాను ఓ కార్డులో ప్రచురించారు. విందు సమయంలో ఆహార పదార్థాలు వృథా కాకుండా నివారించడానికి ఈ ప్రయత్నం చేశామని కోడూరి లక్ష్మీనారాయణ తెలిపారు. కాగా, వివాహ విందు కార్డు నెట్టింట వైరలవుతోంది.