కుటుంబ కలహాలతో భార్య, కుమార్తె హత్య (వీడియో)
AP: వైఎస్సార్ జిల్లా తొండూరు మండలంలో దారుణం జరిగింది. తుమ్మలపల్లె గ్రామానికి చెందిన గంగాధర్ భార్య, కుమార్తెను కిరాతకంగా నరికి చంపాడు. భార్య చిన్ని (30), కుమార్తె గంగోత్రి (14)ని కత్తితో నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు గంగాధర్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.