TG: నల్గొండ జిల్లాలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. జిల్లాకేంద్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని కృష్ణవేణి హాస్టల్‌లో మంగళవారం ఉదయం టిఫిన్ సందర్భంగా యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెట్టారు. దీంతో యాజమాన్యంతో విద్యార్థులు గొడవకు దిగారు. ఇలాంటి ఘటనపై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా.. వాళ్లు పట్టించుకోవడం లేదని విద్యార్థులు మండిపడ్డారు. దీనిపై అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.