నాకు ఏ రాజకీయ నాయకుడితో సంబంధం లేదు: రకుల్ ప్రీత్ సింగ్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ ను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఖండించారు. 'బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళ ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గపు పుకార్లను వ్యాప్తి చేయడం బాధాకరం. పాలిటికల్ మైలేజీ కోసం నా పేరును కూడా ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నా. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. నాకు ఏ రాజకీయ పార్టీ/వ్యక్తితో సంబంధం లేదు. రాజకీయాల కోసం ఇలాంటి కల్పిత కథలతో ముడిపెట్టడాన్ని ఆపేయాలి' అని ట్వీట్ చేశారు.