'పుష్ప-2' ప్రోడ్యూసర్పై DSP అసంతృప్తి.. వీడియో వైరల్
చెన్నైలో జరిగిన పుష్ప-2 మూవీ ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ పై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 'టైమ్ కు పాట, BGM ఇవ్వలేదని అంటున్నారు. నా మీద మీకు ప్రేమ కంటే ఎక్కువ కంప్లెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా లేట్ గా వచ్చానని అంటున్నారు. నాకు సిగ్గు ఎక్కువ. నేనేం చేయను. ఇవన్నీ సెపరేట్ అడిగితే కిక్ ఉండదు. అందుకే ఇలా అడిగేస్తున్నా' అని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.