ఐపీఎల్ మెగా వేలంలో ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ భారీ ధర పలికాడు. అతడిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.12.50 కోట్లకు సొంతం చేసుకుంది. హేజిల్‌వుడ్ ను కొనుగోలు చేసేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కూడా పోటీపడింది. అలాగే గత సీజన్లో పంజాబ్ తరఫున అదరగొట్టిన జితేశ్ శర్మను బెంగళూరు దక్కించుకుంది. కనీస ధర రూ.1 కోటి ఉన్న అతడిని రూ.11 కోట్లకు ఆర్సీబీ సొంతం చేసుకుంది.