సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్.. దరఖాస్తు గడువు పెంపు
సీబీఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును JAN 10 వరకు పెంచారు. CBSEలో 70% మార్కులతో టెన్త్ పాసైన అమ్మాయిలు దీనికి అర్హులు. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల్ని ప్రోత్సహించేలా దీన్ని అమలు చేస్తున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.1000 చొప్పున రెండేళ్లు అందుతాయి. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. 11వ తరగతి పూర్తైన వారు మళ్లీ రెన్యువల్ చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్ cbse.nic.in