శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు పీఎస్‌ఎల్‌వీ-సీ60 కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రాకెట్ అనుసంధానం పూర్తయిన తర్వాత వివిధ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆదివారం రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా కొనసాగిన తర్వాత సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ60 కక్ష్యలోకి దూసుకెళ్లనుంది.