సీఎం ఇంటి ముందు BPSC అభ్యర్థుల నిరసన.. పోలీసుల లాఠీఛార్జ్ (వీడియో)

55చూసినవారు
బీహార్‌లోని పాట్నాలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంటి వద్ద BPSC అభ్యర్థులు ఆదివారం నిరసనకు దిగారు. దీంతో విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. BPSC ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి.. పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆందోళన చేస్తున్న అభ్యర్థులను పోలీసులు విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో సీఎం ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై సీఎం ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్