BREAKING: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
దేశంలోని పలు రాష్ట్రాలకు గవర్నర్లను మంగళవారం కేంద్ర ప్రభుత్వం నియమించింది. మూడు రాష్ట్రాల్లో గవర్నర్లను బదిలీ చేసి.. రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. కేరళ గవర్నర్గా రాజేంద్ర ఆర్లేకర్, మిజోరం గవర్నర్గా విజయ్ కుమార్ సింగ్, ఒడిశా గవర్నర్గా కంభంపాటి హరిబాబు, బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, మణిపుర్ గవర్నర్గా అజయ్ కుమార్ భల్లాను నియమించింది.