గుజరాత్ వడోదరలో జరిగిన రెండో వన్డేలో విండీస్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 115 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థి జట్టు 46.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మాథ్యూస్ అద్భుత సెంచరీతో 106 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో ప్రియా మిశ్రా 3 వికెట్లు పడగొట్టగా, దీప్తి శర్మ, ప్రాతిక, సాధు తలో 2 వికెట్లు, రేణుక ఠాకూర్ ఒక వికెట్ చొప్పున తీశారు.