జూనియర్ ఎన్టీఆర్ తన వీరాభిమాని కౌశిక్ హాస్పిటల్ బిల్లు కట్టి ఆర్ధిక సాయం చేశారు. కౌశిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న సమయంలో సాయం చేస్తానని తాను ఇచ్చిన మాటను ఎన్టీఆర్ నిలబెట్టుకున్నారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కౌశిక్‌ను ఎన్టీఆర్ టీమ్ తాజాగా దగ్గరుండి డిశ్చార్జి చేయించింది. దాంతో, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.