గుజరాత్‌లో 4.2 తీవ్రతతో భూకంపం

70చూసినవారు
గుజరాత్‌లో 4.2 తీవ్రతతో భూకంపం
గుజరాత్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. పాలన్‌పూర్, అంబాజీ, పటాన్‌ వంటి పలు ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. దాదాపు 10 సెకన్ల పాటు భూకంపం సంభవించింది. దాని ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అహ్మదాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఎత్తైన భవనాల్లో కూడా భూకంపం సంభవించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్