కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారంలో భాగంగా శుక్రవారం బహిరంగా సభలో పాల్గొన్న రాహుల్ కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నిత్యం నేను ఓబీసీ అని చెప్పుకునే మోడీ.. ప్రధానిగా పదేళ్లలో వాళ్ల కోసం చేసిందేమి లేదన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ వ్యాపారస్తులకు కట్టబెడుతున్నారని నిప్పులు చెరిగారు.