భారత నౌకాదళ సన్నాహక విన్యాసాల్లో పెద్ద ప్రమాదం తప్పింది. తొలిసారిగా ఈ ఏడాది భారత నేవీ-డే వేడుకలను ఒడిశాలోని పూరి సాగర తీరంలో నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు సన్నాహక విన్యాసాల్లో పాల్గొనగా ఒక్కసారిగా ఓ పక్షి ఎగురుతూ వాటిమధ్యలోకి వచ్చింది. ఆ పక్షి గమనాన్ని పైలెట్లు గమనించి అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.