గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ

63చూసినవారు
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. శనివారం ఉదయం మల్పూర్ నుంచి వస్తున్న స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు డివైడర్‌ను దాటుకుని మొదాసా నుంచి మల్పూర్‌కు వెళ్తున్న మరో బస్సును వేగంగా ఢీకొట్టింది. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్రంగా రక్తస్రావం అయి ముగ్గురు మృతి చెందగా, మరో 30 మంది మాత్రం గాయాలతో బయటపడ్డారు.