ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతుంది. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పలు ప్రాంతాలలో మంచు సైతం కురుస్తున్నది. ఉదయం రాత్రి వేళల్లో చలి నుంచి ఉపశమనం కోసం మంటలు కాగుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు ఎక్కువగా ఉమ్మడి జిల్లాలోనే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరింత చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.