ఏనుగుల దాడిలో ఉప సర్పంచ్ మృతి
AP: ఏనుగుల దాడిలో TDP యువనేత రాకేశ్ చౌదరి మృతి చెందాడు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్నరామాపురం, కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు సంచరించాయి. ఏనుగుల గుంపు ఉందన్న సమాచారంలో రాకేశ్ తోటలోకి వెళ్లాడు. ఏనుగులు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. గతంలో రాకేశ్ కందులవారిపల్లి ఉపసర్పంచ్గా, టీడీపీ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన మృతిపై ఎమ్మెల్యే నాని సంతాపం తెలిపారు.