భీంపూర్ తహసీల్దార్ గా నలందప్రియ
భీంపూర్ మండల తహసీల్దార్ గా కె. నలందప్రియ బాధ్యతలు స్వీకరించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఎన్నికల విభాగ పర్యవేక్షకులుగా ఉన్న ఆమెను ఇటీవల భీంపూర్ తహసీల్దార్ గా నియమించగా, ఇక్కడ పనిచేస్తున్న సత్యనారాయణ ఇచ్చోడకు బదిలీఅయ్యారు. ఈ సందర్భంగా నూతన తాసిల్దార్ మాట్లాడుతూ మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.