ఏపీ మంత్రుల్లో కొందరికి ఉద్వాసన తప్పదా?
ఏపీలో కొందరు మంత్రులకు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. 6 నెలల పాలనపై మంత్రులకు ర్యాంకింగ్స్ ఇస్తానని చంద్రబాబు అప్పట్లో ప్రకటించారు. ఇక అప్పటి నుంచి ఏ క్షణమైనా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే గాసిప్ పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది. నలుగురు, ఐదుగురు మంత్రుల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక వారి స్థానంలో తమకు మంత్రి పదవి ఖాయమని కొందరు సీనియర్లు ఆశగా వెయిట్ చేస్తున్నారట.