అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే కాల్స్ పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. టెలికాం ఆపరేటర్లు కూడా దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. ఫోన్ నంబర్ల స్టార్టింగ్ కోడ్ +8, +65, +85 నుంచి వచ్చే కాల్స్‌లను లిఫ్ట్ చేయవద్దన్నారు. ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేస్తే సంచార్ సాథి పోర్టర్‌లోని Chakshuలో రిపోర్ట్ చేయాలన్నారు.