గొంతు క్యాన్సర్‌ను గుర్తించడానికి బ్రిటన్‌లోని ఆరోగ్య సేవల సంస్థ ఒక ఐఫోన్ సాధనం, యాప్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం కొన్ని ఆస్పత్రుల్లో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 32 ఎంఎం లెన్స్, యాప్ ఉంటాయి. ఈ సాధనంతో ఎండోస్కొపీ పరిశీలనలను అప్పటికప్పుడు సేకరించి నిపుణులకు పంపుతుంది. వారు ఈ వీడియో దృశ్యాలను విశ్లేషించి గొంతు క్యాన్సర్‌కు సంబంధించిన ఆనవాళ్లను వేగంగా గుర్తిస్తారు.