AP: విజయవాడ, విశాఖలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం రూ.42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెట్రోకు రూ.25,130 కోట్లు, విశాఖ మెట్రోకు రూ.17,232 కోట్లు ప్రతిపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన సమయంలో కేంద్రం తీసుకొచ్చిన విభజన చట్టం ప్రకారం.. మెట్రో నిర్మాణానికి కేంద్రమే నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది.